గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్‌

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్‌

కల్వకుర్తి టౌన్‌: పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వంగూర్‌ మండలం రంగాపూర్‌కు చెందిన ఆలే సత్యనారాయణ అలియాస్‌ సత్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కురుమూర్తి వివరాల మేరకు.. మూడేళ్లుగా సత్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అత డు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా ప్రాంతానికి చెందిన లకన్‌ అలియాస్‌ లాలా, సునీత అనే ఇద్దరు వ్యక్తుల నుంచి కిలోల లెక్కన గంజాయిని కొనుగోలు చేసేవాడు. అనంతరం చిన్నచిన్న పాకెట్లుగా తయారుచేసి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యువతకు ఒక్కో పాకెట్‌ రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తూ.. డబ్బు సంపాదించడంతో పాటు యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్లు పో లీసులు తెలిపారు. ఈ మేరకు సత్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కురుమూర్తి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement