కొత్తకోట మండలంలోని పాలెం గ్రామానికి చెందిన గుండె నవీన్‌కుమార్(26) గత కొంతకాలంగా కొత్తకో ట పట్టణంలోని బీపీఆర్ గార్డెన్‌న్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ, భార్య గౌత మి, కుమారుడితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇటీవల గ్రామంలో నూతన ఇంటి నిర్మా ణం కొరకు అప్పులు చేయడంతో పాటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి వివాదం జరగడంతో భార్య గౌతమి తన సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం అర్ధరాత్రి తాను పనిచేస్తున్న గార్డెన్స్‌లో ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. వారు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి గుండె ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20) అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరో విషాదాన్ని మిగిల్చింది. ఉషారాణికి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేష్‌తో ఈ ఏడాది జూన్ 25న వివాహమైంది. వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలం సజావుగా సాగిన దాంపత్యంలో.. నెల రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఉషారాణి తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై తల్లిదండ్రులు అల్లుడికి సర్దిచెప్పినప్పటి కీ వేధింపులు కొనసాగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఉషారాణి మంగళవారం ఉదయం నాగారం నుంచి కనిమెట్టలోని పుట్టింటికి వచ్చి.. మధ్యాహ్నం చీరతో ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు భర్త మల్లేష్, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపారు.
● వేర్వేరు ఘటనల్లో భార్యలతో గొడవ పడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
● అదనపు కట్నం వేధింపులతో
నవవధువు బలవన్మరణం
● వనపర్తి జిల్లా కొత్తకోట
మండలంలోనే
3 ఘటనలు


