దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వృద్ధుడు

చిన్నచింతకుంట: దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్ర మాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు.. కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన చిన్నభాస్కర్‌రెడ్డి(63) సోమ వారం రాత్రి కుటుంబ స భ్యులతో కలిసి తిరుపతికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఆంధ్ర రాష్ట్రం అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండ లం పీలేరు సమీపంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని తుఫాన్‌ ఢీకొట్టింది. తుఫాన్‌ లో 9 మంది ఉండగా చిన్నభాస్కర్‌రెడ్డి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు పంచనామా చేసి మృతదేహానికి పోస్టుమార్టం ని ర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వేర్వేరు ప్రమాదాల్లో

నలుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ క్రైం:ముందు వెళ్తున్న మోపెడ్‌ వాహనాన్ని డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మంగళవారం జ రిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దివి టిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మో పెడ్‌ వాహనంపై ఓ తాత, మనువడు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టడంతో వృద్ధుడితో పాటు బాలుడు గాయపడ్డాడు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆటో బోల్తా పడిన ఘటనలో..

అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రంలోని హైవేపై ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. అడ్డాకులలోని రుచిబేకరి కోసం మహబూబ్‌నగర్‌ నుంచి ఆటోలో కిరాణా సామగ్రిని తీసుకొస్తున్నారు. మూసాపేట చౌరస్తాలో హైవేపై రోడ్డు దాటుతున్న మోపెడ్‌ ఆటోకు అడ్డు రాగా దాన్ని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ఉన్న చందు అనే బాలుడి కాలుకు తీవ్రంగా గాయపడగా ఆటోను డ్రైవర్‌ చింటూ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు ఇద్దరిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఎల్‌ఎల్‌బీ 3వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. పరీక్షలకు 113 మంది విద్యార్థులు హాజరుకాగా 93 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 20 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న క్రీడలు

పీయూలో టీచర్స్‌ డే సందర్భంగా సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడలు మూడో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ మేరకు క్రికెట్‌ పోటీలను వీసీ శ్రీనివాస్‌ టాస్‌ వేసి ప్రారంభించారు.కార్యక్రమంలో వీసీ ఓఎస్డీ మధుసూఐదన్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement