మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టో ర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. నిజామాబాద్‌లో శుక్రవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు జరిగే జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట) గురువా రం తరలివెళ్లింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మొయిన్ స్టేడియంలో జట్టును అభినందించారు. ఎన్‌పీ వెంకటేశ్ మాట్లాడుతూ సమిష్లిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. జిల్లా ఫుట్‌బాల్ క్రీడాకారులు, క్రీడాకారిణులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి కేఎస్ నాగేశ్వర్, ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ నికేష్, ప్రకాశ్, నరేష్ పాల్గొన్నారు.
● జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు
ఎన్.నిఖిత, టి.రుత్విక, రిషితారాజ్, సాన్విత, ఆ నంద వర్షిణి, కీర్తి, ఈ.స్వాతి, ఎ.మోక్ష, వి.దీక్ష, ఎ ల్.అనూష, ఎ.వర్ష, నిహారిక, ఎల్.నిహారిక, ఎ.నిత్యశ్రీ, కె.మాధవి, పి.హారిక, ఎ.శ్రావ్య, నవ్య ప్రసన్న.


