మహబూబ్‌నగర్ క్రైం: నగరంలో ఉండే ప్రతి కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాల నియంత్రణతోపాటు నేరస్థులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్‌నగర్‌లో శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహించారు. మొదట పోలీస్ బృందాలు ఇంటింటి తిరిగి స్థానికంగా ఉంటున్న వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 29 బైకులు, నాలుగు ఆటోలను గుర్తించారు. అనంతరం చౌరస్తాలో స్థానికులకు డీఎస్పీ పలు అంశాలపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


