మహబూబ్‌నగర్ క్రైం: నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారించేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డు, ఏనుగొండ ఎదిర ఎక్స్‌రోడ్, నూతన కలెక్టరేట్ ఎదుట, భూత్పూర్ రోడ్డులో ఉన్న ప్రమాదకర మలు పులు, చించోళి బైపాస్ రోడ్డు, కోయిలకొండ ఎక్స్‌రోడ్‌లను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. హెచ్చ రిక బోర్డులు, రోడ్డు భద్రత ఏర్పాట్లు, సిగ్నల్స్, డివైడర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధింత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కలెక్టరేట్ దగ్గర మలుపు దగ్గర ఉన్న రంబుల్ స్ట్రిప్స్‌ను తొలగించి, ముందస్తు హెచ్చరిక కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కట్టడి చేయడం, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


