ఆలిండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడా
మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం నుంచి ఈనెల 28 వరకు జరిగే ఆలిండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ జోనల్ పోటీల్లో స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు జిల్లా క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో 22కేజీల విభాగంలో వినూత్న, 37కేజీల కేటగిరీలో తన్షిత, 47కేజీల విభాగంలో సాయిలక్ష్మి పాయింట్ ఫైట్‌లో, సీనియర్ విభాగంలో యామిని మ్యూజికల్ ఫామ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీమ్ మేనేజర్ జయదీప్ సింగ్ పాల్గొన్నారు.


