హోరాహోరీగా టీ–20 క్రికెట్ లీగ్
● సత్తాచాటిన జోగుళాంబ గద్వాల,
నారాయణపేట జట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ మూడోరోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి. మూడో లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు విజయం సాధించాయి. ఈ లీగ్‌లో నారాయణపేట రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఏడు వికెట్ల తేడాతో..
బుధవారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల జట్టు ఏడు వికెట్ల తేడాతో నాగర్‌కర్నూల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్‌కర్నూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. చరణ్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు, సంజయ్ 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు కె.విక్రం 2, జునైద్ మీర్జా 2, యూనుస్, వెంకట్‌సాగర్, మహ్మద్ ఖయ్యూం చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. జట్టులో ఎస్.అరవింద్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు గగన్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా మహ్మద్ ఖయ్యూం (గద్వాల) నిలిచారు.
75 పరుగుల తేడాతో..
మరో లీగ్ మ్యాచ్‌లో నారాయణపేట జట్టు 75 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నారాయణపేట జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జట్టులో ఆర్యాన్ 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు, ఈ.అభిలాష్‌గౌడ్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశారు. వనపర్తి బౌలర్లు యశ్వంత్, గట్టు పవన్, రోహిత్ చరణ్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు నారాయణపేట బౌలర్ల ధాటికి 14.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు అక్షయ్ 3, భానుప్రసాద్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అక్షయ్ (నారాయణపేట) నిలిచారు.


