గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే..
మూడోరోజు క్రికెట్ పోటీలకు మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి లీగ్‌లతో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని.. జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాజీ క్రీడాధికారి రమేష్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, మన్నాన్, కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్‌గౌడ్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, చందుయాదవ్, బాలస్వామి, ప్రవీణ్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.


