టిప్పర్ ప్రమాదంలో కూలీ..
బిజినేపల్లి: మండలంలోని మిట్యాతండా గ్రామ పంచాయతీ భీమునితండా సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద టిప్పర్ ఢీకొని వట్టెం గ్రామానికి చెందిన పద్మ బాలయ్య (40) అనే కూలీ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన బాలయ్య అనే కూలీ భీమునితండాలో నిర్మిస్తున్న వంతెన పనులకు కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ వెనకకు వెళ్తునప్పుడు బాలయ్య, మరో వ్యక్తి ప్రమాదశావత్తు దాని కింద పడ్డారు. గాయపడిన ఇద్దరిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా బాలయ్య మరణించగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సోమవారం బిజినేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


