సిరంజీల కొరత | - | Sakshi
Sakshi News home page

సిరంజీల కొరత

Nov 25 2025 10:51 AM | Updated on Nov 25 2025 10:51 AM

సిరంజ

సిరంజీల కొరత

పెద్దాస్పత్రిలో..

రక్త శాంపిల్స్‌ సేకరించే ట్యూబ్స్‌లేక రోగుల అవస్తలు

తిరిగి పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

గ్యాస్ట్రిక్‌ సమస్య తగ్గించే ప్యాంటప్‌

ఇంజక్షన్స్‌ కరువు

పాలమూరు: నిరుపేద రోగులకు పెద్దదిక్కుగా ఉండాల్సిన జనరల్‌ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్పత్రిలో ప్రధానంగా కావాల్సిన వాటిలో సిరంజ్‌లు, రక్త శాంపీల్స్‌ సేకరించడానికి ట్యూబ్స్‌..కానీ ఇక్కడ ఆ కొరతే రోగులను వేధిస్తోంది. సామాన్యులకు ఈ చిన్నపాటి సమస్యలే ఆస్పత్రి చుట్టూ తిరిగేవిధంగా చేస్తున్నాయి.

● జనరల్‌ ఆస్పత్రిలో కొన్నిరోజుల నుంచి ఒకవైపు సిరంజీలు మరోవైపు రక్త శాంపిల్స్‌ సేకరించే ట్యూబ్స్‌ కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రతిరోజూ ఆస్పత్రిలో అన్నిరకాల విభాగాల్లో చికిత్స కోసం వచ్చే రోగుల రక్త నమూనాలు సేకరించడానికి వందల సంఖ్యలో మూడురకాల ట్యూబ్‌లు అవసరమవుతాయి. ఓపీలో వైద్యుడు పరీక్షించిన తర్వాత రక్త పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత రోగులు శాంపిల్స్‌ ఇవ్వడానికి శాంపిల్స్‌ సేకరించే గదికి వెళ్తారు. అక్కడ సరిపడా ట్యూబ్‌లు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఆస్పత్రికి అరకొర సరఫరా చేస్తున్న క్రమంలో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక ప్రధానంగా రోగులకు ఇంజక్షన్స్‌ వేయడానికి ఉపయోగించే సిరంజ్‌ల కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న ఇంజక్షన్స్‌ ఇచ్చే గదిలో ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే రోగులకు పలురకాల ఇంజక్షన్స్‌తోపాటు టీటీ, డాగ్‌బైట్‌, ఇతర ఇంజక్షన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాయిల్స్‌లో ఉండే డ్రగ్‌ను సిరంజ్‌ ద్వారా నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో 1సీసీ, 2సీసీ, 5సీసీ, 10సీసీ సిరంజ్‌లు అవసరం కాగా ప్రస్తుతం 2సీసీ సిరంజ్‌లు రోజు ఒక బాక్స్‌ మాత్రమే ఇస్తున్నారు. 5సీసీ సిరంజ్‌లు లేకపోవడంతో ఇతర మార్గాల్లో సిస్టర్స్‌ సర్దుబాటు చేస్తున్నారు. గ్యాస్ట్రిక్‌ సమస్యలతో వచ్చే రోగులకు ఇవ్వాల్సిన ప్యాంటప్‌ ఇంజక్షన్స్‌ అందుబాటులో లేవు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా ఆజ్మీరాను వివరణ కోరగా పైనుంచి రావాల్సిన ఇండింట్‌ కొంత మేర కొరత ఉండడంతో స్థానికంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నాం. ఓపీ అధికంగా ఉన్నరోజు ఇబ్బంది అవుతుంది.. ఇంకా ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మాట్లాడుతున్న మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

నారాయణపేట రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దివాళా తీసిందని.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు సర్పంచ్‌ ఎన్నికలకు సిద్ధమైందని మహబూబ్‌నగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలకుల సమయం ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూర్ఖత్వం అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పి పవర్‌లూమ్స్‌పై ఆగమేఘాల మీద చీరలు తయారు చేయించడం సరికాదన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలైన మహిళలకు రూ.2,500, ఆసరా పింఛన్‌ రూ.4 వేలకు పెంపు, నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు అందించలేదని విమర్శించారు. కొడంగల్‌, నారాయణపేటను జంట నగరాల మాదిరి అభివృద్ధి చేస్తానన్న మాటను తుంగలో తొక్కి తన నియోజకవర్గంలో శరవేగంగా పనులు చేసుకుంటున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉందని.. కాగితాలపై పనుల మంజూరు ప్రకటనలే తప్ప అమలుకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన మాదిరే రేవంత్‌ తన వరకే పనులు చేసుకోవడం సరికాదన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పట్టణంలో ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ మహిళా కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను మరోచోటకు తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొత్త మండలాల ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్‌, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, రఘురామయ్యగౌడ్‌, తిరుపతిరెడ్డి, లక్ష్మి, బలరాంరెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

సిరంజీల కొరత 1
1/1

సిరంజీల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement