ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
మాగనూర్: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గుడి శంకర్(19) మాగనూర్‌కు చెందిన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు సమాచారం మేరకు సంఘటనా చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సొదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉద్యోగం రావడం లేదని వివాహిత ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ గోవర్దన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని రాఘవేంద్రకాలనీకి చెందిన నాగరాజు, శశికళ (33)లకు ఏడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. నాగరాజు జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తుండగా.. శశికళ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త నాగరాజు మధ్యాహ్నం బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి శశికళ ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు కూతుళ్లతో
తల్లి అదృశ్యం
నవాబుపేట: భర్తతో తరుచు గొడవ పడుతూ తన పుట్టింటికి వచ్చి ఇక్కడే కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్న మహిళ తన ఇద్దరు కవల పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెల్లిపోయింది. దీంతో ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె దేవమ్మ కూతురు జ్యోతిని 9 ఏళ్ల క్రితం కోయిల్‌కొండ మండలం కానాయపల్లికి చెందిన వడ్డె చెన్నయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వారికి మొదటి సంతానం ఆడబిడ్డ కాగా, రెండో సంతానంలో ఇద్దరు (కవలలు)ఆడ పిల్లలు జన్మించారు. మొత్తం ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వచ్చింది. ఇక్కడే కూలీ పని చేస్తూ కాలం గడుపుతోంది. ఈనెల 22న శనివారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ఇద్దరు కవలలు సింధు, అనుష(7 ఏళ్లు) ను తీసుకుని ఇంట్లో నుంచి వెల్లిపోయింది. వారి కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తల్లి తల్లి దేవమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
పోక్సో కేసులో
వ్యక్తి రిమాండ్
గద్వాల క్రైం: బాలికతో అసభభ్యంగా వ్యవహరించి, అత్యాచారయత్నం పాల్పడిన సంఘటనలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. గద్వాల మండలానికి చెందిన మహేష్‌గౌడు మైనర్ బాలికతో చనువుగా ఉంటు పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడాడ్డు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో అసభ్యంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించడన్నారు. నిందితుడిని అలంపూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ శ్రీను తెలిపారు. మైనర్ బాలిక పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
జూరాలకు 6వేల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఎగువన ఒక యూనిట్‌లో 39 మెగావాట్ల ద్వారా 509.961 ఎం.యూ., దిగువన ఒక యూనిట్‌లో 40 మెగావాట్ల ద్వారా 502.637 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ, దిగువ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 1012.598 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని ఎస్‌ఈ శ్రీధర్, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో 9.480 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 6,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య


