
పతకాలు సాధించడం అభినందనీయం
మహబూబ్‌నగర్ క్రీడలు: కేంద్రీయ విద్యాలయ జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని బొల్లారంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన 54వ కేంద్రీయ జాతీయ ఆర్చరీ క్రీడా పోటీల్లో కంపౌండ్ కేటగిరిలో మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు స్మృతి సన్నిభా ఫస్ట్‌రౌండ్, సెకండ్ రౌండ్‌లో బంగారు పతకాలు, కృతిక్ శ్రీవత్సవ్ ఫస్ట్‌రౌండ్‌లో రజతం, సెకండ్ రౌండ్‌లో కాంస్య పతకాలు సాధించడంపై సోమవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.