
మహబూబ్‌నగర్ 331 ఆలౌట్
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని కేసీఆర్–2 మైదానంలో సోమవారం బీ–డివిజన్ టూడే లీగ్ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్ –ఖమ్మం జట్ల మధ్య లీగ్ ప్రారంభమైంది. జరిగింది. తొలి రోజు మహబూబ్‌నగర్ 87.1 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాఫే 73 పరుగులు (111 బంతుల్లో, 14 ఫోర్లు), ఛత్రపతి 63 పరుగులు (169 బంతుల్లో, 9 ఫోర్లు), కేతన్‌కుమార్ 62 పరుగులు (85 బంతుల్లో, 12 ఫోర్లు) రాణించారు. ఖమ్మం బౌలర్లు వి.మహేష్, విశాల్ యాదవ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. మంగళవారం ఖమ్మం బ్యాటింగ్ చేయనుంది.
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కంట్రోలర్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ, పీజీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్వీడీసీ కళాశాల పరీక్ష కేంద్రాలన్ని పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాలని, కాపీయింగ్‌కు పాల్పడి చర్యలు తీసుకుంటామని సూచించారు.
కార్గో హమాలీ కూలీరేట్ల పెంపునకు అంగీకారం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్గోలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల రేట్ల పెంపునకు అంగీకారం కుదిరిందని ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శి సురేశ్ తెలపారు. ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని వారం కిందట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నోటీస్ అందజేసిన నేపథ్యంలో సోమవారం కాంట్రాక్టర్‌తో సుదీర్ఘంగా చర్చలు చేసినట్లు తెలిపారు. పెంచిన కూలీ రేట్లు నేటినుంచి అమల్లోకి తెస్తామన్నారు. కూలీరేట్ల పెంపునకు అంగీకరించిన కార్గో ఏజెన్సీ కాంట్రాక్టర్, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగన్న, శంకరయ్య, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ 331 ఆలౌట్