
వేరుశనగ పొట్టుతో గణేశుడు
కరీంనగర్ అర్బన్: వేరుశనగ పొట్టుతో తయారుచేసిన వినాయక విగ్రహాలు ప్రజావాణి కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీజ.. గ్రీన్ గెలాక్సీ సంస్థను నిర్వహిస్తోంది. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించగా.. మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అయితే, వేరుశన పొట్టుతో తయారు చేయించిన.. పర్యావరణానికి మేలు వినాయక విగ్రహాలను మంత్రి, కలెక్టర్‌కు అందజేశారు. వీటిని కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ప్రదర్శించాలని కలెక్టర్ అప్పుడు సూచించారు. దీంతో సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వేరుశనగ పొట్టుతో తయారుచేసిన గణపతి విగ్రహాలు ప్రదర్శించారు. ప్రతిమలు ఆకర్షణీయంగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఇప్పటికే ఇలాంటి పర్యావరణహితమైన అనేక ప్రయోగాలు చేసి పలువురు ప్రముఖుల మన్ననలు పొందింది.
కరీంనగర్ ప్రజావాణిలో ప్రదర్శన