
దేవరకద్రలో కార్డెన్‌సెర్చ్
దేవరకద్ర: మున్సిపాలిటీ కేంద్రంలో శాంతిపరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ నాగన్నతోపాటు మరో 8మంది ఎస్‌ఐలు, 80 మంది పోలీసులు దేవరకద్రలోని అన్నివార్డుల్లో కవాతు నిర్వహించి ఇంటింటికి తిరిగి కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుని ఆధార్ కార్డులను పరిశీలించారు. కొత్తవారు, అనుమానితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 బైక్‌లు, కారును సీజ్ చేశారు. రాత్రి వేళ కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యువకులకు సూచించారు.