దేవరకద్ర: వరి కోతలు ప్రారంభం కావడంతో పెద్దఎత్తున మార్కెట్‌కు వచ్చిన ధాన్యం టెండర్లు పూర్తయిన రెండు రోజులుగా తూకాలు వేసే సమయం సరిపోకపోవడంతో మార్కెట్‌లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. దీంతో శనివారం పేరుకుపోయిన ధాన్యంను తూకాలు వేసి లోడింగ్ చేశారు. గురు, శుక్రవారాల్లో మార్కెట్‌కు వచ్చిన సోనామసూరి, హంస ధాన్యం పెద్దఎత్తున మార్కెట్‌లోనే నిల్వ ఉండటంతో శనివారం రోజంతా కేవలం ధాన్యం తూకాలు వేయడంతోపాటు లారీలకు లోడింగ్ చేశారు. శనివారం మార్కెట్‌కు సెలవు కలిసివచ్చింది. ఇక ఆదివారం కూడా సెలవు ఉండడంతో లావాదేవీలు జరగవు.
విద్యార్థి దశ నుంచేపొదుపు అలవర్చుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యార్థి దశ నుంచే విద్యార్థులు పొదుపు చేయడం అలవర్చుకోవాలని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి అన్నారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అకౌంటింగ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్త ప్రణాళిక, వాటి ఆవశ్యతకత, వినియోగదారుడు– పరిరక్షణ చట్టాలు– వినియోగ విద్య అంశంపై సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం డీసీఐడీ అధ్యక్షుడు బాల్‌లింగయ్య సమాజంలో వినియోగదారుల పాత్ర, వినియోగదారుల హక్కులు, బాధ్యత చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, వాసంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment