
అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామవాసి. 1997లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేశారు. కొంతకాలంపాటు లింగాల పీహెచ్‌సీ వైద్యుడిగా పనిచేశారు. 1999లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.రాములు చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో పి.రాములుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014, 2018లో వరుస ఎన్నికల్లో బరిలో నిలిచి ఓడిపోయారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment