
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో తెలుగు, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మైక్రోబయోలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర సబ్జెక్టులకు సంబంధించి పీహెచ్‌డీలో వర్క్ పూర్తి చేసిన స్కాలర్స్‌కు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్ చంద్రకిరణ్ వీసీకి వివరించారు.
సులభంగాబోధన విధానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు బోధించాల్సి ఉంటుందని ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు. ఈ మేరకు ఎంవీఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వలంటీర్లు పిల్లలకు కథలు, చిత్రాల ద్వారా సులువుగా బోధించే విధంగా శిక్షణ తీసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రాఘవేందర్, స్వరూప్, నిరంజన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో రెండో ఏడాది మూడో సెమిస్టర్ తరగతులు శనివారం నుంచి ప్రారంభమవు తున్నాయని కో ఆర్డినేటర్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ తరగతులు సైతం ఇదే రోజున ప్రారంభం అవుతున్నాయని విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరుకావాలని కోరారు.
త్వరలో రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తాం
● హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో త్వరలో రంజీట్రోఫీ మ్యాచ్‌లు నిర్వహించేలా గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతామని హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు అన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న ఆయన మొదటిసారిగా శుక్రవారం స్థానిక పిల్లలమర్రి సమీపంలోని క్రికెట్ మైదానాన్ని పరిశీలించారు. ఇక్కడి మైదానాన్ని అవసరమైతే మరింత విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. అనంతరం జగన్‌మోహన్‌రావును ఘనంగా సన్మానం చేశారు. ఆయన వెంట ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, సంయుక్త కార్యదర్శి క్రిష్ణమూర్తి, కోచ్ గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
