
మహబూబ్‌నగర్: మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి రాత్రిళ్లు మొసళ్లు రోడ్లపైకి వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోవర్ధనగిరి గ్రామ కత్వా, కామదేనుపల్లి ఊరకుంట సమీపంలో రాత్రి వేళల్లో తరుచూ సంచరిస్తూ రోడ్డుపైనే వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురై కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నె, వీపనగండ్ల, రంగవరం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపైకి రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.