తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్‌ఐ నరేష్, ఆర్‌ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు.


