సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు

Mar 19 2026 8:33 AM | Updated on Mar 19 2026 8:33 AM

జీలుగ ఎరువు

వర్మీ కంపోస్టు ఎరువు

అలంపూర్‌: పంటల సాగులో కొన్నేళ్లుగా రసాయన ఎరువుల వాడకం విపరీపతంగా పెరిగింది. దీంతో నేల తన సహజత్వాన్ని కోల్పోతుంది. భూసారం క్షీ ణిస్తుండడంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పంట ఉత్పత్తుల్లోనూ రసాయ న ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఉండి ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో నేల సంరక్షణకు సేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి వాటి స్థానంలో పశువులు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చిరొట్టె ఎరువులు వేయాలి. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ శాతం ఎంత ఉందని తెలసుకోవాలి. దీనిని బట్టి సేంద్రియ ఎరువులు పంటకు వేయాలి. ఇలా చేయడం వలన భూమి సారవంతం కావడంతో పాటు పెట్టుబడి తగ్గి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని ఏడీఏ వివరించారు.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement