మహబూబ్‌నగర్ క్రైం: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి పోలీసులు అన్ని విధాలుగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్ పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎస్పీ సందర్శిచి తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రతి జిరాక్స్ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద అవసరంగా నిలబడకుండా సహకరించాలన్నారు.


