నేడు డయల్‌ యువర్‌ఆర్‌ఎం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు బుధవారం డయల్‌ యువర్‌ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు 99592 26295 నంబర్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని కోరారు.

ఉదయం డయల్‌ యువర్‌ డీఎం

బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపోకు సంబంధించి ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను 9959226286 నంబర్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని కోరారు.

నేడు మున్సిపల్‌ బడ్జెట్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ బడ్జెట్‌ (2023–24) సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ డి.ప్రదీప్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హాజరవుతారని, కౌన్సిల్‌ సభ్యులందరూ విధిగా పాల్గొనాలని ఆయన కోరారు.

వేరుశనగ @ రూ.7,460

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ గరిష్టంగా రూ.7,460, కనిష్టంగా రూ.3,629 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్న గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,800, పెబ్బర్లు రూ.4,469, కందులు గరిష్టంగా రూ.7,361, కనిష్టంగా రూ.6,203, ఆముదాలు గరిష్టంగా రూ.6,242, కనిష్టంగా రూ.6,090, జొన్నలు రూ.5,410, మినుములు రూ.7,480 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆముదాల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,133, కనిష్టంగా రూ.6,129గా ధరలు నమోదయ్యాయి. కాగా మార్కెల్‌లో బుధవారం ఉల్లిపాయల వేలం జరుగుతుంది. ప్రస్తుతం సీజన్‌ కావడంతో వేలాది బస్తాల ఉల్లి మార్కెట్‌కు అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top