నెల్లికుదురు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో పండే ఉద్యాన, కూరగాయలు, ఆయిల్ పామ్, మల్బరీ లాంటి పంటల సాగు మేలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండల కేంద్రంలో రైతులు నూతనంగా సాగుచేస్తున్న ఆయిల్ పామ్ తోటలో బిందు సేద్యాన్ని మంగళవారం ఆయన పరిశీలంచారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలు, వాటి పరిరక్షణ, మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. కార్యక్రమంలో శ్రీను, విష్ణు, ఫీల్డ్ అధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో బయ్యారం, గూడురు, మహబూబాబాద్ కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, క్యాట్ వంటి పోటీ పరీక్షల సబ్జెక్టులు బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీఈఓ అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, గణితం, బయోలజికల్‌సైన్స్, క్యాట్ సబ్జెక్ట్‌ల బోధనకు ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత ఉండాలన్నారు. దరఖాస్తులు నేటి నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6గంటల వరకు సంబంధిత కస్తూర్బాగాంధీ విద్యాలయంలో సమర్పించాలన్నారు. బయ్యారం 4, గూడూరు 4, మానుకోటలో 4 పోస్టులు ఉన్నాయన్నారు.
మరిపెడ న్యాయవాదుల అడహక్ కమిటీ
మరిపెడ రూరల్: మరిపెడలో నూతన బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని న్యాయవా దులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవా రం తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈమేరకు అడ్‌హక్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా రావులు రఘరామిరెడ్డి, కో–కన్వీనర్లుగా బానోతు లాలు, లింగాల శ్రీను, అలు వాల శ్రీశైలం, తొనుకునూరి సైదులు, వెంకటేశ్వర్లు, యాకాబ్రం, మోహన్‌చంద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ జూనియర్ సివిల్ జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌కు తాత్కాలిక కమి టీ నియామక పత్రం అందజేశారు. అనంతరం తొర్రూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం మాట్లాడుతూ.. త్వరలో మరిపెడ బార్ అసోసియేషన్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని, అప్పటి వరకు తాత్కాలిక కమిటీ కొనసాగనున్నట్లు తెలిపారు.
కొబ్బరికాయల టెండర్ రూ.11.24లక్షలు
కొత్తగూడ: గుంజేడు జాతరలో కొబ్బరికాయలు విక్రయించేందుకు మంగళవారం సీల్డ్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈటెండర్‌లో ముగ్గురు పోటీపడి వేలం పాట పాడా రు. గత ఏడాది టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ జనగం రమేశ్ మళ్లీ రూ.11.24 లక్షలకు టెండర్ దక్కించుకున్నాడు. ఈఓ సత్యనారా యణ, డివిజన్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అనంతరావు, ధర్మకర్తల చైర్మన్ నరేదర్, పూజారులు వెంకన్న, నర్సయ్య, కిరణ్, రాంబాబు, సిబ్బంది వెంకన్న పాల్గొన్నారు.
రక్త పరీక్షలు కచ్చితత్వంతో చేయాలి
నెహ్రూసెంటర్: మలేరియా వ్యాధి నిర్ధారణలో రక్త పరీక్షలను పకడ్బందీగా, కచ్చితత్వంతో నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ న్నా రు. జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు రక్తపు స్మియర్ పరీక్షలు, మైక్రోస్కోప్ ద్వారా పరాన్నజీవుల గుర్తింపు, పరీక్ష ఫలితాల నమోదు, నివేదికలపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మలేరియా వ్యాధి నియంత్రణకు పీహెచ్‌సీలో రక్తపు స్మియర్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అనుమానిత కేసుల ను పరీక్షించాలని సూచించారు. మలేరియా, డెంగీ వ్యాధులను తగ్గించేందుకు ముందస్తు గు ర్తింపు, నివారణ చర్యలను బలోపేతం చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్ర మీల, డెమో రాజ్‌కుమార్, వి.శ్రీనివాస్, అక్బర్, కల్యాణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


