రైతుల పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

రైతుల పడిగాపులు

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సరుకులు విక్రయానికి తీసుకొచ్చిన రైతులు పడిగాపులు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామునే రైతులు ధాన్యం, అపరాలు, పత్తి, మక్కలు విక్రయించేందుకు తీసుకురాగా వ్యాపారులు ఖరీదు చేశారు. అనంతరం ఇ–నామ్‌ రశీదులను రైతులకు మార్కెట్‌ సిబ్బంది అందజేశారు. ఈక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని, అప్పటివరకు కొనుగోళ్లు జరిపేదిలేదని వ్యాపారులు తేల్చిచెప్పగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు మార్కెట్‌ యార్డులోనే పడిగాపులపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేందర్‌ విషయం తెలుసుకుని మార్కెట్‌కు వచ్చి వ్యాపారులను పిలిపించి మాట్లాడుతుండగానే రైతులు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కి రాస్తారోకో చేసే ప్రయత్నం చేశారు. డీఎంఓ నరేందర్‌ వారి వద్దకు వెళ్లి కొనుగోళ్లు సజావుగా జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అనంతరం వ్యాపారులతో మార్కెట్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఒక కంప్యూటర్‌, నూతన ఎలక్ట్రానిక్‌ కాంటాలు తెప్పిస్తామని చెప్పారు. అదేవిధంగా సీసీ కెమెరాలు మరమ్మతు చేయిస్తామని, కూలీలు కూడా త్వరగా ధాన్యాన్ని బస్తాల్లో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టగా సమస్య సద్దుమణిగింది.

నేడు ధాన్యం, మక్కలు,

అపరాల మార్కెట్‌ బంద్‌..

మానుకోట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నెలకొన్న సాంకేతిక కారణాల వల్ల ధాన్యం, మక్కలు, అపరాల మార్కెట్‌ బుధవారం బంద్‌ చేస్తున్నామని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్‌కి ధాన్యం, మక్కలు, అపరాలు తీసుకురావద్దని కోరారు. పత్తి కొనుగోళ్లు యథా విధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని సరుకులకొనుగోళ్లలో వ్యాపారుల జాప్యం

ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాతల ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement