మినీ జాతరలో విద్యుత్‌ అంతరాయం ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

మినీ జాతరలో విద్యుత్‌ అంతరాయం ఉండొద్దు

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మినీ మేడారం జాతరలో విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల కేంద్రంలో రూ.17 లక్షలతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో జిల్లాలో 20 విద్యుత్‌ ఉపకేంద్రాలు మంజూరయ్యాయని, లింగాల ప్రాంతంలో మరో ఉపకేంద్రం ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదకర విద్యుత్‌ లైన్ల మార్పునకు రూ.3 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ భవనంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు దేవేందర్‌, మండల అధ్యక్షుడు నర్సింహస్వామి పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement