పెరిగిన పత్తి ధర | - | Sakshi
Sakshi News home page

పెరిగిన పత్తి ధర

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్క, పత్తికి మంచి ధరల లభించాయి. ప్రభుత్వ నిర్ణయించిన పత్తి మద్దతు ధర రూ.8,667 ఉండగా.. సోమవారం క్వింటాల్‌కు రూ.9,005 ధర పలికింది. మక్కకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,410 ఉండగా..రూ.3,180 ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

● కర్లపల్లి శివారులో ఘటన

గోవిందరావుపేట: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస రెడ్డి(48) కర్లపల్లి శివారులో ఉన్న తన పొలం వద్దకు కొడుకు అభిలాష్‌తో కలిసి ట్రాక్టర్‌పై వెళ్లాడు. వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో ట్రాక్టర్‌ రాకపోకలకు అడ్డంగా ఉన్న పైపులను తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పస్రా సీఐ దయాకర్‌, ఎస్సై తాజొద్దీన్‌ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లో సున్నపు రాళ్లతండాకు

చెందిన బాలుడు..

నెల్లికుదురు : హైదరాబాద్‌లో విద్యుదాఘాతంతో మహబూబాబాద్‌ జిల్లా బంజర గ్రామ శివా రు సున్నపు రాళ్లతండాకు చెందిన బాలుడు బాదా వత్‌ నవకిశోర్‌(14) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్‌ రవి, నవిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ వలస వెళ్లా రు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నా రు. పెద్ద కుమారుడు నవకిశోర్‌ 9వ తరగతి చదువుకుంటూ ఖాళీ సమయంలో హౌస్‌ వైరింగ్‌ పనులకు వెళ్తున్నాడు. మంగళవారం పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు.

వనదేవతల కానుకల

అప్రైజ్‌మెంట్‌ ప్రారంభం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకల అప్రైజ్‌మెంట్‌ (విలువ నిర్ధారణ) ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. హనుమకొండలోని మేడారం సమ్మక్క ధార్మిక భవనంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దేవాదాయశాఖ జువెల్లరీ వెరిఫికేషన్‌ అధికారి అంజనీదేవి పర్యవేక్షణలో నిపుణులు బంగారం, వెండి కానుకలను పరిశీలి స్తూ వాటి విలువను అంచనా వేస్తున్నారు. మేడా రం మహాజాతరతో పాటు ఇతర సందర్భాల్లో భక్తులు అమ్మవార్లకు మొక్కుగా చెల్లించిన బంగారం, వెండి కానుకలను భద్రపరిచిన అధికారులు వాటి నాణ్యత, బరువు తదితర అంశాలను పరిశీలించి విలువను నిర్ధారించే ప్రక్రియ చేపట్టారు. కానుకల విలువను లెక్కించే ప్రక్రియ పూర్తికాలేదని మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం బంగారం, వెండి కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

వెంకట్రాజయ్యకు లెజెండ్‌ అవార్డు

కాశిబుగ్గ : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి విశ్రాంతి సూపరింటెండెట్‌ ప్రముఖ వైద్య నిపుణుడు వెంకట్రాజయ్యకు ప్రతిష్టాత్మక లెజెండ్‌ అవార్డు ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. డాక్టర్‌ వెంకట్రాజయ్య నాలుగు దశాబ్దాల పాటు వైద్యరంగంలో సేవలు అందిస్తూ, ఇప్పటికీ 76 ఏళ్ల వయస్సు వచ్చినా వైద్య విద్యార్థులకు బోధన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement