● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి
గూడూరు: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడు తూ.. జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. గూడూ రు నేటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాజ్యసభ సభ్యు డు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గూడూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానని, మండలంలోని భీమునిపాద జలపాతం పర్యాటక అభివృద్ధితో పాటు రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వకపోగా, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి మండలంలోని బొద్దిగొండలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధ, వెన్నెం శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగారెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నరేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మాధవపెద్ది రమేశ్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బాలా జీనాయక్, స్వామి, శ్రీపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, కొమ్మాలునాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధే లక్ష్యం
కేసముద్రం: మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో అర్పనపల్లి నుంచి నెక్కొండ మండలం నాగారం గ్రామానికి రూ.20 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ, సర్పంచ్ సూ రయ్య, పీసీసీ సభ్యుడు దస్రూనాయక్, మున్సి పల్ చైర్‌పర్సన్ సునీత, వైస్ చైర్‌పర్సన్ రమ, నాయకులు దుర్గేష్, మహేందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వెంకన్న, నాగరాజు పాల్గొన్నారు.
అంకితభావంతో పని చేయాలి
మహబూబాబాద్: జిల్లా అభివృద్ధికి అధికారులు అంకితభావంతో పని చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఇందిమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్లను వేం నరేందర్‌రెడ్డితో పాటు అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి మంజూరు చేయాలన్నా రు. ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, ఎస్పీ శబరీష్, మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


