● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబాబాద్: భూ రీ సర్వేను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం భూ రీ సర్వే, భూ సమస్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.


