బయ్యారం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో జరిగిన అండర్–15 అకాడమీ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో బయ్యారం మండలానికి చెందిన 14ఏళ్ల కసిరెడ్డి లోకేష్‌రెడ్డి 109బంతుల్లో 300 పరుగులు చేసి ప్రతిభ చాటాడు. లోకేష్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉంటున్నాడు. కాగా, క్రికెట్ మ్యాచ్‌లో 28 ఫోర్లు, 23సిక్సర్ల సాయంతో 300 పరుగులు సాధించిన లోకేష్‌రెడ్డిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్‌రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో టెస్ట్ క్రికెట్ ఆడాలన్నదే తన లక్ష్యం అని చెప్పాడు.


