చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● హనుమకొండ అదనపు కలెక్టర్‌ రవి

కమలాపూర్‌ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంజేపీ (బాలికల)లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–14, 17, 19 విభాగాల్లో ఎంజేపీ పాఠశాలలు, కళాశాలల బాలికల క్రీడా పోటీలు (కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, టెన్నికాయిట్‌, చెస్‌, క్యారం్స, అథ్లెటిక్స్‌) ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు. కాగా, పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. ఎంజేపీ హనుమకొండ జిల్లా డీసీఓ స్టెల్లా, స్థానిక ఎంజేపీ ప్రిన్సిపాళ్లు సౌజన్య, రవీందర్‌, తహసీల్దార్‌ సురేశ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా డీసీఓలు, వివిధ ఎంజేపీ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీఈటీలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement