నిబంధలకు విరుద్ధంగా..
మహబూబాబాద్: దీపావళి పండుగ సమీపిస్తుండడంతో బాణసంచా వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్లియరెన్స్ రాకముందే తాత్కాలిక బాణసంచా విక్రయ షాపుల నిర్మాణా లు చేపడుతున్నారు. షాపుల ఏర్పాటులో పలువురు వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. షాపుల ఏర్పాటు సమయంలో సంబంధిత శాఖల అధికారులు నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించాలి. కానీ అధికారులు సైతం ఆదిశగా ఎలాంటి చర్చలు చేపట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు
జిల్లాలోని 18 మండలాలకు గాను 4 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా అగ్నిమాపక కార్యాలయంలోనే అగ్నిమాపక కేంద్రం ఉంది. దాని పరిధిలో మానుకోట, కురవి, గంగారం మండలాలు ఉన్నాయి. డోర్నకల్ మండల కేంద్రంలోని అగ్ని మాపక కేంద్రం పరిధిలో డోర్నకల్, గార్ల, సీరోల్ మండలాలు.. మరిపెడ మండల కేంద్రంలో అవుట్ పోస్ట్ కేంద్రం ఉండగా దాని పరిధిలో మరిపెడ, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, చిన్న గూడూరు, దంతాలపల్లి మండలాలు ఉన్నాయి. కేసముద్రం అగ్నిమాపక కేంద్రం పరిధిలో కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు పరిధిలో నెల్లికుదురు, గూడూరు, కొత్తగూడ మండలాలు ఉన్నాయి.
నాలుగు శాఖల ఎన్‌ఓసీలు అవసరం..
బాణసంచాల వ్యాపారం చేయాలనుకునేవారు నాలుగు శాఖల ఎన్‌ఓసీలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా ఆన్‌లైన్‌లోనే కాగా దానిలో అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ కీలకం. ఆయా కేంద్రం పరిధిలో దరఖాస్తు చేసుకుంటే ఆ కేంద్రాల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నుంచి జిల్లా అగ్నిమాపక అధికారికి దరఖాస్తు చే రితే తాను ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మున్సిపాలిటీ నుంచి, పోలీస్ శాఖ నుంచి, తహసీల్దార్ నుంచి కూడా ఎన్‌ఓసీ తీసుకుని ఆర్డీఓ కా ర్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డీడీ రూపంలోనే..
పోలీస్, తహసీల్దార్, అగ్నిమాపక శాఖల ఎన్‌ఓసీలకు రూ.500 డీడీల రూపంలో మున్సిపాలిటీలో రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఎన్‌ఓసీలతో ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేస్తున్నప్పుడు లైసెన్స్ ఫీజు రూ.600 డీడీ (డీడీ కోడ్ 10012301004)కు జిల్లా కలెక్టరేట్ పేరున డీడీ రూ.1,200 చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత అన్ని సవ్యంగా ఉంటే ఆర్డీఓ కార్యాలయంలో ప్రొసీడింగ్ ఇస్తారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు అనుమతి (ఐదు రోజుల పాటు)ఇస్తారు.
నిబంధలు ఇలా..
షాపుల మధ్యదూరం మూడు మీటర్లు ఉండాలి. ప్రతీ షాపునకు 200 లీటర్ల వాటర్ డ్రమ్, ఇసుకతో బకెట్, మంటలు ఆర్పే సిలెండర్ (ఫైర్ ఎక్స్ మిషన్) ఇది అగ్నిమాపక శాఖ చూసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ శాఖ ఆ షాపుల వద్ద పార్కింగ్ ఉందా.. లేదా.. చూసి ఎన్‌ఓసీ ఇవ్వాలి. రెవెన్యూ అధి కారులు స్థలం పరిశీలించి కేటాయించాలి. మున్సి పాలిటీ అధికారులు పారిశుద్ధ్య తదితర విషయాలను పరిశీలించి ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది.
నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా దుకాణాల ఏర్పాటు
దరఖాస్తు చేసుకున్న కొందరు యాజమానులు
క్లియరెన్స్‌కు ముందే షాపుల నిర్మాణం
డీడీల రూపంలోనే ప్రొసీడింగ్ ఫీజుల చెల్లింపు
మున్సిపాలిటీ నుంచి 22 మంది ఎన్‌ఓసీ మాత్రమే తీసుకుని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో షాపులను ఏర్పాటు చేశారు. అనుమతి రాకున్నా.. వస్తుందనే నమ్మకంతో ఏర్పాట్లు చేస్తున్నారు. షాపుల మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలున్నా.. పట్టించుకోకుండా పక్క పక్కనే షాపులను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇసుక బకెట్ మాత్రమే ప్రతీసారి అందుబాటులో ఉంచుతూ.. ఫైర్‌సిలెండర్ వంటి జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. వాటర్ డ్రమ్‌లు కూడా ప్రతీ షాపు ఎదుట ఉండాలి కానీ కొందరే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియం అంతా షాపులతో నిండింది. కొనుగోలుదారుల వాహనాలకు పార్కింగ్ స్థలం లేదు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లా అంతా ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే అన్ని పరిశీలించి స్థలం కేటాయించి ఆ తర్వాత ఎన్‌ఓసీలు ఇస్తే బాగుండేదని.. ఏదైనా ప్రమాదం జరగకముందే ఆయా శాఖల అధికారులు జాగ్రత్తలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు.


