శంకర్‌దాదా.. ఎంబీబీఎస్‌! | - | Sakshi
Sakshi News home page

శంకర్‌దాదా.. ఎంబీబీఎస్‌!

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

బోర్డులపైనే డాక్టర్లు..

మానుకోటలో అర్హత లేని డాక్టర్లతో వైద్యం

అర్హత లేకుండా వైద్యం చేయొద్దు

సాక్షి, మహబూబాబాద్‌ : ‘ఇటీవల కాలంలో మహబూబాబాద్‌ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్‌ ఏరియాలో ఉన్న ఓ ఆస్పత్రిని అధికారులు తనిఖీ లు చేశారు. ఫిజయోథెరఫీ చేసేందుకే అనుమతి ఉన్న సదురు డాక్టర్‌ ఇతర ఎండీ, ఎంస్‌, వివిధ రకా ల డాక్టర్ల పేరుతో ఆస్పత్రి నడిస్తున్నారు. అక్కడ నిజానికి ఏ డాక్టర్‌ లేరని గుర్తించినట్లు సమాచారం. అయితే సదరు అధికారులు ఆస్పత్రి నిర్వహణ, పనిచేసే డాక్టర్ల వివరాలు సమర్పించాలి.. లేకపోతే ఆస్పత్రి సీజ్‌ చేస్తామని చెప్పినట్లు సమాచారం.’ ఇలా జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో అనుమతి లేకు న్నా స్థాయికి మించి వైద్యం చేస్తున్న ఆస్పత్రులు.. డాక్లర్లు ఉన్నట్లు తెలిసింది.

అర్హతల లేనివారితో వైద్యం..

పేరుకు కార్పొరేట్‌, నర్సింగ్‌ హోం, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి పేరు పెట్టడం.. లోపల మాత్రం అర్హత లేని వారు వైద్యం చేస్తూ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్‌ క్లీనిక్‌లు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్స్‌ మొత్తం 137 వరకు జిల్లా వైద్యాధికారి ద్వారా అనుమతి తీసుకున్నవి ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఉన్నాయి. అయితే ఇందులో బోర్డులపై ప్రముఖ డాక్టర్ల పేర్లు పెట్టి లోపల మాత్రం అర్హత లేని వారు వైద్యం చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా వారు చదివిన చదువు ప్రకారం.. కండరాలు, నరాల్లోకి రక్త ప్రసారం జరిగేందుకు కావాల్సిన మస్సాజ్‌, ఎక్ససైజ్‌లు చేయించడం, కండరాలను కదిలించడం, పేన్‌ కిల్లర్లు, మల్లీ విటమిన్‌ వంటి మందులు ఇవ్వాల్సిన వారు కూడా ఇతర వైద్యచికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం. రూ.వేలకు వేలు ఫీజులు వేసి టెస్టులు చేయించడం, యాంటీబాటిక్స్‌ మొదలుకొని వారికి తెలిసిన మందులన్నీ రాసి ఇవ్వడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. మరికొందరు అయితే డాక్టర్ల స్థానంలో సీనియర్‌ కాంపౌండర్‌ను కూర్చోబెట్టి వైద్యం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తనిఖీలకే పరిమితమైన అధికారులు..

దేవుడితో సమానంగా పూజించే వైద్యరంగంలో ఇంత ఘోరం జరుగుతున్నా.. అధికారులు మాత్రం తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఒక మండల కేంద్రంలో అర్హత లే కుండా వైద్యం చేసే వారి ఆస్పత్రిని తనిఖీలు చేసిన అధికారులు.. ఆస్పత్రిని మూసివేశారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ రెండు రోజులకే ఆ ఆస్పత్రి మళ్లీ ఓపెన్‌ చేయడం.. వైద్యం అందించడం పరిపాటిగా మారింది. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం, ఉత్తుత్తి తనిఖీలతో సరిపెట్టడంతో పదే పదే సమస్యలు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లాలోని మహబూబాబాద్‌ పట్టణంతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో ఇటీవల కాలంలో వెలసిన పలు ఆస్పత్రులకు అసలు డాక్టరు ఎవరో అనే అర్థంకాని పరిస్థితి నెలకొంది. వైద్య వృత్తితో సంబంధం లేని వారు కొందరైతే.. ప్రాథమిక చికిత్స చేసేందుకు అనుమతి ఉన్నవారు ఇంకొందరు. ఫిజియోథెరఫీ చేసేందుకే అర్హత ఉన్నవారు మరికొందరు. కానీ వీరిలో కొందరు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తూ అక్కడ కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రి సేవలు ఉన్నట్లు ఫ్లెక్సీలు, కరపత్రాలు ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో పనిచేసే ప్రముఖ డాక్టర్లు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రి ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పేర్లు పెట్టుకొని రోగులను ఆకర్షిస్తున్నారు. కానీ ఆయా ఆస్పత్రుల్లో ఇతర వైద్యులు ఎవరూ కాకుండా నిత్యం ఒక్కరే ఉంటున్నారని రోగులు చెబుతున్నారు.

ఆస్పత్రుల బోర్డుపై ప్రముఖ వైద్యుల పేర్లు

గుడ్డిగా నమ్మి మోసపోతున్న రోగులు

అధికారుల తనిఖీల్లో తేలినా..

చర్యలు శూన్యం?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యం చేయడానికి అర్హతలు ఉండాలి. పీఎంపీలు, ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స వరకే చేయాలి. ఫిజియోథెరఫీ, ఇతర సర్టిఫికెట్లు ఉన్నా.. వారి పరిధికిమించి యాంటీబాటిక్స్‌, ఇతర మందులు ఇవ్వడం నేరం. ఇప్పటికే జిల్లాలో పలువురికి నోటీసులు జారీ చేశాం. అవసరమైతే నిబంధనలుపాటించనిపై చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement