పెద్దవంగర: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. 15వ ఆర్థి క సంఘం నిధులు రూ.1.43 కోట్లతో మండల కేంద్రంలో నిర్మించిన నూతన పీహెచ్‌సీ భవనాన్ని, మోత్య తండాలో ఉపాధిహామీ పథ కం నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూత న గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందన్నారు. నూతన పీహెచ్‌సీ భవనంలోని ఆరోగ్య సేవలను ప్రజ లకు సమర్థవంతంగా అందించాలని వైద్యశాఖకు సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ భవనా లు గ్రామ పరిపాలనలకు కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రభుత్వ సేవలు ప్రజలకు మ రింత చేరువయ్యేల పంచాయతీలు పాలన అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, సర్పంచ్‌లు ముద్దసాని పారి జాత, గుగులోత్ కవిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి, జాటోతు నెహ్రూనాయక్, బీసు హరికృష్ణ పాల్గొన్నారు.
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సైన్స్ సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని జిల్లా సైన్స్ అధికారి బి.అప్పారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు పలువురు అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిట్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో సుస్థిర భవిష్యత్ కోసం బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రస్థాయికి నాలుగు ఎగ్జిబిట్లు ఎంపికయ్యాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా అకడమిక్ కోఆర్టినేటర్లు రామ్‌మెహన్, ఫిరోజ్‌ఖాన్, హేస్సేన్, న్యాయ నిర్ణేతలు అప్పారావు, స్రవంతి, గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిధుల జమ మెసేజ్‌లపై ఫిర్యాదు
మహబూబాబాద్ రూరల్ : రైతు భరోసా నిధులు జమ అయినట్లు మెసేజ్‌లు రావడంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర బుధవారం తెలిపారు. జిల్లాలో కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్లు మెసేజ్‌లు వచ్చిన విషయంపై వ్యవసాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గోపి స్పష్టత ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రైతు భరోసా నిధులు ఏమీ విడుదల చేయలేదని, సాంకేతిక సమస్య వల్ల రైతు భరోసా నిధులు జమ అయినట్లు కొంతమంది రైతులకు మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామని, రైతులు గమనించాలని తెలిపారు.
అటవీశాఖలో
ఇద్దరు సస్పెన్షన్ ?
గూడూరు: అక్టోబర్ మొదటి వారంలో గూడూరు ఫారెస్ట్ రేంజ్ దామరవంచ, బ్రాహ్మణపల్లి గ్రామాల పరిధిలోని మామిడి చెట్ల నరికివేత వాల్టా చట్టానికి విరుద్ధంగా జరిగిందని.. అందుకు కారణకులైన ఇద్దరు అధికారులపై జిల్లా అటవీశాఖ అధికారి పంపిన నివేదిక మేరకు సీసీఎఫ్ వారిపై చర్యలు చేపట్టి సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. నెల రోజుల క్రితం దామరవంచ, బ్రాహ్మణపల్లి గ్రామాల పరిధి మామిడి చెట్ల నరికివేతలో డీఎఫ్‌ఓ ఇద్దరు బీట్ అధికారులను సస్పెన్షన్ చేశారు. వారితోపాటు ఆ గ్రామాల పరిధిలోని డీఆర్‌ఓ పిచ్చేశ్వర్, మచ్చర్ల ఎఫ్‌ఎస్‌ఓ బి.శ్రీను కారకులంటూ వారిపై చర్యలకు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు నివేదిక పంపినట్లు సమాచారం. డీఎఫ్‌ఓ నివేదిక మేరకు సీసీఎఫ్ విచారణ జరిపి ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారనే సమాచారం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయమై గూడూరు ఎఫ్‌ఆర్వో ప్రసాదరావును వివరణ కోరగా.. తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని తెలపడం ప్రశ్నార్థకం.


