మాదకద్రవ్యాల నిర్మూలనపై పోరు | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నిర్మూలనపై పోరు

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

● ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

● సే నో టు డ్రగ్స్‌ నినాదంతో 7న 5కే రన్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన 5కే రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సే నో టు డ్రగ్స్‌ అనే నినాదంతో ఆరోగ్యకర సమాజం కోసం అడుగులు వేయండని పోలీసులు పిలుపునిచ్చారు. ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది 5కే రన్‌ విజయవంతంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడంతోపాటు డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి 5 కిలోమీటర్ల పరుగు నిర్వహించనున్నారు. 5కే రన్‌ లో యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పోలీస్‌ శాఖ కోరుతుంది. 5కే రన్‌లో పాల్గొనాలనుకునేవారు https://docs.google.com/forms/d/e/1FAIpQLSerGrYtoegEKDYVJjkddFyvLlk6M1i8QoeXQen7zxSrjvOAA/ viewform?us p=dialog ద్వారా గూగుల్‌ ఫాంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పోలీస్‌ శాఖ సూచించింది.

మత్తుపదార్థాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములవుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కోసం చేపట్టే 5కే రన్‌ విజయవంతం చేయాలి.

– శబరీష్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement