న్యాయ విజ్ఞాన ప్రచారంలో పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయ విజ్ఞాన ప్రచారంలో పాల్గొనాలి

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన ప్రచారంలో బాలబాలికలు పాల్గొనాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పిలుపునిచ్చారు. న్యాయ సేవా దినోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యార్థులకు కోర్టు ఆవరణలో బుధవారం వకృత్వ పోటీలు నిర్వహించారు. మంచి సమాజ నిర్మాణంలో ప్రాథమిక విధుల పాత్ర, ఎల్‌ నినో దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాలపై విడివిడిగా నిర్వహించిన పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారి, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ దాసరి నాగేశ్వరరావు, పానెల్‌ న్యాయవాది యసాడి చెన్నమల్లారెడ్డి పోటీలు నిర్వహించి విజేతలను నిర్ణయించారు. విజేతలకు గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ చేతులమీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి స్వాతి మురారి తెలిపారు. నవంబర్‌ 9 జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చట్టపరమైన అంశాలతోపాటు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి స్వాతి మురారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement