ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

హసన్‌పర్తి: ప్రజాస్వామ్య పరిరక్షణలో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి మేధావుల సదస్సు హసన్‌పర్తి మండల కేంద్రంలోని ఓ బంక్వెట్‌ హాల్‌లో నిర్వహించగా ప్రేమేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ఎస్‌ఐఆర్‌’ రాజ్యాంగబద్ధప్రక్రియ అన్నారు. ఓటరు జాబితాలో పారదర్శకత తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. మరణించిన వారి పేర్లు, బోగస్‌ ఓట్లు, నివాసం మారిన వారి వివరాలను సరిచేయడమే ఈప్రక్రియ లక్ష్యమన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు. ఇలాంటి పరిణామాలను మేధావులు అప్రమత్తంగా ఉండి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, మాజీ కార్పొరేటర్‌ గురుమూర్తిశివకుమార్‌,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారపల్లి రాంచెంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు మారం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement