ఎస్‌ఐఆర్‌పై ఆందోళన అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై ఆందోళన అవసరం లేదు

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

● సీనియర్‌ జర్నలిస్టు సురేశ్‌ కొచ్చెట్టిల్‌

హన్మకొండ : దేశవ్యాప్తంగా నిర్వహించే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్‌ జర్నలిస్టు సురేశ్‌ కొచ్చెటిల్‌ అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో ప్రజ్ఞ భారతి వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి నిబంధనల ప్రకారం ఎస్‌ఐఆర్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కొత్తదేమీ కాదని, గతంలో 8 సార్లు నిర్వహించారని వివరించారు. ఆరు సార్లు కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే జరిగాయన్నారు. వాజ్‌పేయ్‌ హయాంలో కూడా ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. 2001–2002 నాటి ఎస్‌ఐఆర్‌ తర్వాత దాదాపు 24 సంవత్సరాలుగా పూర్తిస్థాయి సవరణ జరగలేదన్నారు. ఎస్‌ఐఆర్‌.. ఓటు హక్కును కాలరాయడానికి కాదని, ఓటరు జాబితాలోని అక్రమాలు, బోగస్‌ ఓట్లను ఏరివేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియ మాత్రమేనన్నారు. ప్రజ్ఞా భారతి వరంగల్‌ శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రామ్‌ గోపాల్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రముఖ అడ్వకేట్‌ చామర్తి ప్రభాకర్‌, ప్రజ్ఞాభారతి ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement