యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండ

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

ములుగు: యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. బుధవారం ములుగు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అభ్యర్థులు లక్ష్యంపై దృష్టి సారించి శిక్షణ పొందాలని సూచించారు. అనంతరం శిక్షణార్థులతో కలిసి భోజనం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, డీఎస్పీ రవీందర్‌, ఆర్‌ఐ, సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ

మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement