రోల్‌ప్లే పోటీలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది | - | Sakshi
Sakshi News home page

రోల్‌ప్లే పోటీలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: రోల్‌ ప్లే పోటీలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఏసీజీఈ మందుల శ్రీరాములు అన్నారు. మా నుకోట మున్సిపల్‌ పరిధి అనంతారం మోడల్‌ స్కూల్‌లో మంగళవారం జిల్లాస్థాయి రోల్‌ ప్లే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ పోటీల్లో ఎల్లంపేట జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ప్రథమస్థానం, తొర్రూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ద్వితీయస్థానం, అంనతారం మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు, ఉపాధ్యాయులు భాస్కర్‌, యాకమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

శబరిమల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నెహ్రూసెంటర్‌: అయ్యప్ప మాలధారుల శబరిమల యాత్రకు మహబూబాబాద్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ వి.కల్యాణి మంగళవారం తెలిపారు. బస్సుల్లో గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఇద్దరు వంట మనుషులు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ మాలధారులకు సీట్లు లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో మాలధారులకు అనుకూలంగా విశ్రాంతి, భోజన విరామం కల్పించడంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహబూబాబాద్‌ ప్రాంత అయ్యప్ప మాలధారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిబంధనల మేరకుఅనుమతులు ఇవ్వాలి

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: దీపావళి పండుగను పురస్కరించుకుని నిబంధనల మేరకు బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం బాణసంచా దుకాణాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాణసంచా దుకాణాల అనుమతుల కోసం ఆర్డీఓ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.

నేడు జిల్లాస్థాయి బాలల సైన్స్‌ పోటీలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో బుధవారం ఉదయం 9:30 గంటలకు జిల్లాస్థాయి బాలల సైన్స్‌ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి కె.అనిల్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నాలన్నారు. రిజిస్టర్‌ చేసుకున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ సైన్స్‌ అధికారి అప్పారావు 9849598281 నంబర్‌ను సంప్రదించాలని అన్నారు.

ఆరుతడి పంటల సాగుమేలు

మహబూబాబాద్‌ రూరల్‌ : యాసంగిలో వరి వేయవద్దని, ఉద్యాన (ఆరుతడి) పంటల సాగు మేలుదాయకమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులు, మామిడిలో మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో డీహెచ్‌ఎస్‌ఓ మరియన్న మాట్లాడుతూ.. విద్యుత్‌, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, బిందు సేద్యం, ఎత్తు మడులు, మల్చింగ్‌ పద్ధతులు మేలని సూచించారు. బోర్లు, బావుల కింద కూరగాయలు, ఆయిల్‌ పామ్‌, ఉద్యాన పంటలు, పసుపు, మల్బరీ, మునగ, పండ్లు, పూలు సాగు చేస్తూ జిల్లా రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఏడీఏ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారులు తిరుపతి రెడ్డి, రాంజీ, ఉద్యాన అధికారులు శాంతిప్రియదర్శిని, స్రవంతి, ఏఈఓలు లయ, పున్నమి, సరిత, బాలాజీ, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement