గర్భిణులకు వరంగా ‘అమ్మఒడి–102’ వాహన సేవలు
గూడూరు: గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మెరుగైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి–102’ ఉచిత వాహన సేవలు గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన గర్భిణులను ఆశవర్కర్లు ఈ ప్రత్యేక వాహనాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ )కు ఉచితంగా తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు అందజేస్తున్నారు. అనంతరం గర్భిణులను తిరిగి ఆదే వాహనంలో అత్యంత సురక్షితంగా ఇళ్లకు చేర్చుతున్నారు.
కొత్తగూడ, గంగారం మండలాలకు ఒకటి, గూడూరు మండలానికి ఒక వాహనం ఉంది. గతంలో గ్రామాల నుంచి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పతుల్రకు గర్భిణులు ఆటోలు, బైక్‌ల ద్వారా వచ్చేవారు. దీంతో ఆర్థికపరమైన భారంతో పాటు ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ప్రస్తుతం ‘అమ్మఒడి–102’ వాహన సేవలు అందుబాటులోకి రావడంతో గర్భిణులు ప్రతీ వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో సులువైంది. ఉచిత రవాణా సేవలపై గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వాహనంలో ఆస్పత్రుల్లో డెలివరీ కోసం తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత తిరిగి ఇంటికి తీసుకువచ్చి దింపడం లాంటి సేవలు అందుతున్నాయి.
గతంలో ఇబ్బందులు..
ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేత
వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి..


