ఉత్తమ ఫలితాలు సాఽధించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలు సాఽధించాలి

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: ఇంటర్మీడియట్‌లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాఽధించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఇంటర్మీడియట్‌, వొకేషనల్‌ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరుశాతం నిరంతరం పర్యవేక్షించాల ని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అధికారులు, యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను నిరోధించడానికి సమాజం, విద్యాశాఖ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. వసతి గృహాల్లో మెనూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇంటర్మీడియట్‌, వొకేషనల్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి భవిష్యత్‌ ప్రణాళికపై అవగాహన కల్పించాలన్నారు. మైనర్‌ డ్రైవింగ్‌, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి మదార్‌, జిల్లాలోని పది జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement