● నిలిచిపోయిన స్క్రీనింగ్, వైద్య సేవలు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)కు తాళం వేశారు. సెంటర్లో విధులు నిర్వర్తించే ఎన్హెచ్ఎం ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సెంటర్‌కు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాటు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పాఠశాలల్లో స్క్రీనింగ్ నిర్వహించి జిల్లా ఆస్పత్రిలోని ఇంటర్వెన్షన్ సెంటర్‌కు రోజుకో టీంగా పిల్లలను తీసుకురావాలి. ఏదైనా వైద్య సహాయం అవసమైన పిల్లలను జీజీహెచ్‌లోని వైద్యులకు చూపించాల్సి ఉంటుంది. కాగా, ఎన్హెచ్ఎం ఉద్యోగులంతా సమ్మెలో ఉండడంతో స్క్రీనింగ్, వైద్య సేవలు అందడం లేదు.


