గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా వాహనంలో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ ఒడి వాహనాలు ఎంతో మేలు చేస్తున్నాయి.
– శర్వాణి, గర్భిణి, కొత్తగూడ
సుదూరం నుంచి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నాం..
102 వాహనాలు లేక ముందు ఆస్పత్రికి రావాలంటే ఎంతో ఇబ్బంది పడ్డామని మా వాళ్లు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా ఊరు దట్టమైన అడవిలో ఉంటుంది. నా లాంటి గర్భిణులు 7వ నెల దాటగానే ఆస్పత్రికి దగ్గరలోని చుట్టాల ఇళ్లకు చేరుతాం. ప్రభుత్వం వాహన సేవలు అందించడం మా అదృష్టమే.
– రాజేశ్వరి, గర్భిణి, గంగారం
●


