● కేవీకే మల్యాల శాస్త్రవేత్త సుహాసిని
నెల్లికుదురు: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కేవీకే మల్యాల శాస్త్రవేత్త సుహాసిని, ఏఈ భూక్య మహేందర్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూసార పరిరక్షణ ఆవశ్యకత, సేంద్రియ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. వరి పంటలు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.


