కోనేటిలో స్వామివారికి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

కోనేటిలో స్వామివారికి చక్రస్నానం

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

గార్ల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మర్రిగూడెం వేంకటేశ్వరస్వామి వారికి శనివారం ఆలయం ఎదుట గల కోనేటిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ చక్రస్నానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని, కరువు లేకుండా చూడాలని కోరుతూ దేవాలయంలో వేంకటేశ్వరస్వామికి 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి దోపోత్సవం, గజవాహనసేవ, పుష్పయాగం, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ అజ్మీరా బన్సీలాల్‌, వైస్‌ చైర్మన్‌ బానోత్‌ అర్జున, ఈఓ సత్యనారాయణ, కమిటీ సభ్యుడు నాగరాజు, అర్చకులు అచ్యుతాచార్యులు, గోవిందాచార్యులు, కృష్ణచైతన్య చార్యులు, కోట శ్రీనివాస్‌, మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవ్యవస్థపై

అవగాహన కలిగి ఉండాలి

తొర్రూరు రూరల్‌: న్యాయ వ్యవస్థపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ కోర్డు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని పీఎస్‌ఆర్‌, సెయింట్‌ పాల్‌ స్కూల్‌లో పిల్లల భద్రత– పరిరక్షణ, లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్జి ధీరజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటూ న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై మహేందర్‌రెడ్డి, న్యాయవాదులు అశోక్‌, రామకృష్ణ, నాగరాజు, శ్రీకాంత్‌, స్కూల్‌ కరస్పాండెంట్‌ పొనుగోటి సోమేశ్వర్‌రావు, సిస్టర్‌ శానీ, విజయ్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్‌కుమార్‌ శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, తొర్రూరు పట్టణ కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, సెయింట్‌పాల్స్‌ హైస్కూల్‌లో ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తగా 804 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఏసీజీఈ మందుల శ్రీరాములు 98497 61012 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

పర్యావరణ అవార్డు స్వీకరణ

డోర్నకల్‌: మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బండి నర్సింహరావు హైదరాబాద్‌లో పర్యావరణ అవార్డు అందుకున్నారు. హెచ్‌ఎం నర్సింహరావు శనివా రం పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. తమ చివరి పనిదినం రోజు పాఠశాలకు ప్రకటించిన అవార్డు అందుకోవడం గమనార్హం. కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సంస్థ నుంచి అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పురస్కారాన్ని ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం కె.శంకర్‌తో కలిసి నర్సింహరావు అందుకున్నారు.

డిగ్రీ కళాశాల సందర్శన

గార్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌ బానోత్‌ ధర్మానాయక్‌ శని వారం సందర్శించారు. ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు చదువుతోనే ఉన్నత శిఖ రాలు అధిరోహించాలని సూచించారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ తరగతుల విషయంలో వి ద్యార్థులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. ప్రతీ అదివారం కళాశాలలో నిర్వహించే ఓపెన్‌ డిగ్రీ తరగతులకు విద్యార్థులు విధిగా హాజరు కావాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డి.రాజు, రాజేశ్‌, సుందరయ్య, వీరన్న, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించాలి

మహబూబాబాద్‌: మిల్లర్లు వెంటనే బకాయిలు చెల్లించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సివిల్‌ సప్లయీస్‌ జాయింట్‌ కమిషనర్‌ మనోహర్‌కుమార్‌ రాథోడ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని రైస్‌మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిఫాల్ట్‌ మిల్లర్లు 45రోజుల గడువులోపు బకాయిలు చెల్లించాలన్నారు. లేనియెడల తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీసీఎస్‌ఓ రమేశ్‌, సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌, మిల్లర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement