కేఎంసీ సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రిలో పేషెంట్ల పడిగాపులు
కాశిబుగ్గ : వరంగల్ కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రో వైద్య సేవల కోసం పేషెంట్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దాదాపు పదిహేను రోజుల నుంచి సంబంధిత వైద్యులు రాకపోవడంతో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ప్రతి వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు వైద్యసేవలు అందించాల్సి ఉన్నా వారు సరిగా రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, మరొకరు కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరికి ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో సర్కారు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే, ఒకవేళ వారు ఓపీ విధులకు హాజరైతే మధ్యాహ్నం కాకముందే వెళ్లిపోవడం సాధారణంగా మారుతోందని పేషెంట్లు చెబుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో నేషనల్ వైరల్ హైపటైటీస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు వీరు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం సందర్భంగా ఢిల్లీ నుంచి టీం వచ్చిన కూడా వారు పట్టించుకోవడం లేదని సమాచారం.
వైద్యుల సమావేశానికి కూడా డుమ్మా..
ఇటీవల కొత్త సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవల ప్రా రంభం కోసం సమావేశం, తరచూ జరుగుతున్న వైద్యుల సమావేశానికి కూడా వీరు రావడం లేదని ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది.
పదిహేను రోజుల నుంచి అందని గ్యాస్ట్రో వైద్య సేవలు
ఉన్నతాధికారులకు తెలిసినా
ఏమీ చేయలేని పరిస్థితి?


