కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల్లోని అంతర్ కళాశాలల వివిధ క్రీడాపోటీలను (పురుషులకు) నేటినుంచి ఈ నెల 29వ తేదీవరకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌కళాశాలలో నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ టి. శాస్త్రి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి సోమవారం తెలిపారు. బాల్‌బ్యాడ్మింటన్, చెస్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, సాఫ్ట్‌బాల్, క్రాస్‌కంట్రీ పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే జట్లు ఈనెల 27న ఉదయం 8గంటలలోపు కళాశాలకు చేరుకోవాలన్నారు. వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభిస్తారని తెలిపారు. ఈనెల 28న ఉదయం 6గంటలకే క్రాస్‌కంట్రీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.ఇందులోపాల్గొనే క్రీడాకారులు మెడికల్ సర్టిఫికెట్లతోపాటు స్పోర్ట్స్ షూతో రావాలన్నారు.మరిన్ని వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ 9849206310 సెల్‌నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
మెప్మా ఆర్‌పీ ఆత్మహత్య
● హౌసింగ్‌బోర్డు కాలనీలో ఘటన
నయీంనగర్: కుటుంబ కలహాలతో మెప్మా ఆర్‌పీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ హౌసింగ్‌బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. సుబేదారి పోలీసుల కథనం ప్రకారం.. చిట్ల రమాదేవి (40), రామకృష్ణ దంపతులు రెండేళ్లుగా హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. రమాదేవి నర్సంపేట మెప్మా కార్యాలయంలో ఆర్‌పీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రామకృష్ణ దంపతులకు స్వగ్రామం ఊరుగొండలో గృహ నిర్మాణం గురించి బంధువులతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇదే విషయంపై దంపతుల మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రమాదేవి పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కనుకుంట్ల లక్ష్మి తెలిపారు.
మహనీయుడు వాల్మీకి మహర్షి
హన్మకొండ అర్బన్: రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి తదితరులు వాల్మీకి మహర్షి చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎస్.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, ఇతర అధికారులు పాల్గొన్నారు.


