కొత్త రకం మిర్చికి రూ.19,011 ధర | - | Sakshi
Sakshi News home page

కొత్త రకం మిర్చికి రూ.19,011 ధర

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్‌లో తొలిసారి సోమవారం 341 యూఎస్‌ రకం మిర్చి వచ్చింది. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ ఎర్ర ప్రియాంక, కార్యదర్శి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మిర్చి యార్డు సూపర్‌వైజర్‌ ఎం.డి సలీం, వ్యాపారులు మిర్చి కాంటాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన రైతు ధర్మకు చెందిన మూడు క్వింటాళ్ల 341 యూఎస్‌ రకం మిర్చిని కొనుగోళ్లు చేశారు. క్వింటాకు రూ.19,011 ధర చెల్లించారు. దీంతో ఆశించిన ధర లభించడంతో రైతు ధర్మ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement